దుందుభి వాగుపై రూ.20.20 కోట్ల హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన
నాగర్‌కర్నూల్ జిల్లా సిర్సివాడ సమీపంలో దుందుభి వాగుపై రూ.20.20 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. బ్రిడ్జి నిర్మాణంతో నాగర్‌కర్నూల్–జడ్చర్ల అనుసంధానం బలోపేతమై ప్రజలకు, రైతులకు, విద్యార్థులకు రాకపోకలు మరింత సులభం కానున్నాయి.
హరీష్ రావు వ్యాఖ్యలు తగవు.. రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దాడులు మానుకోవాలి:
నాగర్‌కర్నూల్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పాలనపై విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.
నాగర్‌కర్నూల్ విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP వినతి
నాగర్‌కర్నూల్ జిల్లా విద్యారంగ సమస్యల పరిష్కారానికి మంత్రి సీతక్కకు ABVP నాయకులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, హాస్టళ్లలో మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు
సోమవారం నాగర్‌కర్నూల్‌లో మంత్రి సీతక్క పర్యటన
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క జూన్ 22న నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
జూన్ 23 నుంచి శ్రీ భక్త లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జూన్ 23 నుంచి 25 వరకు 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రత్యేక పూజలు, హోమాలు, కళ్యాణ మహోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మానసిక ప్రశాంతతకు యోగనే మార్గం…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, హెల్త్ & వెల్‌నెస్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి యోగా ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు సందేశమిచ్చారు
అన్న-అక్క డిజిటల్ ట్రైనింగ్ విజయవంతం…
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రెండు రోజుల అన్న-అక్క ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఏఐ డిజిటల్ టీచింగ్/లెర్నింగ్ విజయవంతంగా ముగిసింది. 45 మంది విద్యార్థులు ఏఐ టూల్స్, డిజిటల్ టీచింగ్‌లో శిక్షణ పొంది ప్రభుత్వ…
విధుల్లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..
నాగర్‌కర్నూల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ముగ్గురు పోలీసు అధికారుల కుటుంబాలకు తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఒక్కొక్కరికి రూ.99,800 చొప్పున విడో కార్పస్ ఫండ్ చెక్కులను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అందజేశారు.
వెల్దండలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృత పర్యటన..
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
రూ.2,000 కోట్ల టెండర్ గోల్‌మాల్ ఆరోపణలు.. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…
