జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈగలపెంట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ ఎస్. బాలయ్య, లింగాల పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్ఐ ఎల్. శ్రీనివాసులు, పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎం. మహేందర్ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.99,800 చొప్పున చెక్కులను అందించారు.
పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన సిబ్బంది కుటుంబాలకు అండగా నిలవడం కోసం తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అందులో భాగంగా విడో కార్పస్ (లంప్‌సమ్) ఫండ్ కింద ఈ ఆర్థిక సహాయం అందజేయబడినట్లు పేర్కొన్నారు.
మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం మరియు పోలీస్ వెల్ఫేర్ సొసైటీ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, ఏవో కృష్ణయ్య, జిల్లా పోలీస్ కోఆర్డినేటర్ గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.: విధుల్లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..


