ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి
నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు, అర్జీలను వేగంగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
పట్టణంలోని అన్ని కమర్షియల్ సంస్థలు, దుకాణాలు మార్చి 31లోగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి. నాగిరెడ్డి సూచించారు. గడువు తర్వాత తీసుకోకపోతే పెనాల్టీ విధించడంతో పాటు అవసరమైతే షాపులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
జిల్లాకు త్వరలో ‘లోక్ అదాలత్ మొబైల్ వ్యాన్లు’
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు లోక్ అదాలత్ మొబైల్ వ్యాన్లు త్వరలో జిల్లాకు రానున్నాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత తెలిపారు
భూసార పరీక్ష నేలకు శ్రీరామరక్ష
తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామంలో పాలెం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరం నిర్వహించి రైతులకు సేంద్రియ వ్యవసాయం, మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
కొల్లాపూర్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించగా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.
నయినపల్లి మైసమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని నయినోనిపల్లి మైసమ్మ తల్లి ఆలయాన్ని అదనపు కలెక్టర్ అమరేందర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుడిపల్లి రిజర్వాయర్‌ను సందర్శించిన మాజీ మంత్రి
నాగర్ కర్నూల్ జిల్లాలోని గుడిపల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి సందర్శించి ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
2027 జనగణన దేశాభివృద్ధికి కీలకం
2027 జనగణన ప్రక్రియ దేశాభివృద్ధికి కీలకమని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. జనాభా లెక్కల సేకరణను అధికారులు సమన్వయంతో, సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించాలని సూచించారు.
జిల్లా ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు ఉచిత హెచ్‌పీవీ టీకా
నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో 14 ఏళ్ల ఆడపిల్లలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం ఉచిత హెచ్‌పీవీ టీకా ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. అర్హులైన బాలికలు ఆధార్ జిరాక్స్ కాపీతో తల్లిదండ్రులతో కలిసి రావాలని వైద్యాధికారులు సూచించారు.
మహిళా సాధికారతతోనే ప్రభుత్వ లక్ష్యం
నాగర్ కర్నూల్ సాయి స్నేహ ఎలైట్ అపార్ట్మెంట్‌లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను సన్మానించారు. మహిళా సాధికారతకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు మునిసిపల్ చైర్మన్ తీగల సునింద్ర తెలిపారు.
