వివరాల ప్రకారం, ఇసుక కేసులో ట్రాక్టర్ మరియు జేసీబీని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మైనింగ్ శాఖ అధికారులు రూ.60 వేల జరిమానా విధించగా, బాధితుడు ఫైన్ చెల్లించాడు. అయితే వాహనాలను విడుదల చేయడానికి ఎస్సై హరిప్రసాద్ రెడ్డి రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బాధితుడు వాయిస్ రికార్డింగ్స్‌తో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు ట్రాప్ వేసి, బాధితుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.: ఏసీబీ వలలో తిమ్మాజిపేట ఎస్సై
