మూడు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలు జూన్ 23న ఉదయం 9 గంటలకు గణపతి పూజతో ప్రారంభమవుతాయి. అనంతరం విశేష హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 6:30 గంటలకు దీక్ష హోమం నిర్వహిస్తారు.
జూన్ 24న ఆంజనేయస్వామి, గణపతి, అష్టలక్ష్మి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు సుదర్శన హోమం జరుగుతుంది. జూన్ 25న గురువారం నాడు నరసింహస్వామి వారికి పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో మహాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు పూర్ణాహుతి అనంతరం 10:30 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ భక్త లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది.
ఉత్సవాల సందర్భంగా మంగళవారం నుంచి గురువారం వరకు ప్రతిరోజూ భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు.
మరిన్ని వివరాల కోసం భక్తులు 95153 46860 నంబర్‌ను సంప్రదించవచ్చని నిర్వాహకులు సూచించారు.: జూన్ 23 నుంచి శ్రీ భక్త లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు




