Author: voiceofnagarkurnool@gmail.com

వెంకన్న ఆలయంలో వైభవంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం…

బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ అలర్మేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం రెండో శనివారం స్వామి అమ్మవార్ల కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. 36 మంది దంపతులు వ్రతాల్లో పాల్గొన్నారు.

శ్రీ శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిలతైల అభిషేక పూజలు

బీజినేపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలోని శ్రీ శనేశ్వర స్వామి ఆలయంలో శని గ్రహదోష నివారణ కోసం భక్తులు తిలతైల అభిషేక పూజలు నిర్వహించారు. పరమశివునికి రుద్రాభిషేకాలు, నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడ్డంకులు

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై నాగర్‌కర్నూల్ పార్లమెంట్ కమ్యూనికేషన్ కోఆర్డినేటర్ తైలీ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి, పెట్టుబడుల కోసం చేపట్టిన పర్యటనను అడ్డుకోవడం సరికాదని అన్నారు.

BRS ధర్నాపై కేసులు..

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన ధర్నాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతులు లేకుండా ధర్నా నిర్వహించడం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ప్రజా రవాణాకు అంతరాయం కలిగించడం, RDO కార్యాలయంలోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే మర్రి…

కల్యాణ లక్ష్మిని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రతో నీరుగార్చింది

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నీరుగార్చుతోందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

నాగర్‌కర్నూల్‌లో మహిళ హత్య కేసు ఛేదన..

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఇప్పల తండాలో 43 ఏళ్ల మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భూమి కౌలు విషయంలో ఏర్పడిన విభేదాలే హత్యకు కారణమని తెలిపారు. మృతురాలి బంధువైన కరావత్ హీరమ్మను అరెస్ట్ చేసి, ఆమె వద్ద నుంచి…

ఐడీఓసీలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు..

నాగర్‌కర్నూల్ ఐడీఓసీలో కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కార్యాలయాల పరిశుభ్రత, సిబ్బంది హాజరు, రికార్డుల నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. వినియోగంలో లేని రికార్డులను నిబంధనల ప్రకారం తొలగించాలని,…

పోలీసు సిబ్బంది దృఢత్వానికి క్రీడలు అవసరం..

నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.8 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన ఇండోర్ షటిల్ కోర్టును కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటీల్ ప్రారంభించారు. పోలీసుల శారీరక, మానసిక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని…

బెక్కేరలో రీ-సర్వే పనుల పరిశీలన..

కల్వకుర్తి మండలం బెక్కేర గ్రామంలో పైలెట్ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. చెన్నయ్య పరిశీలించారు. రీ-సర్వేపై ప్రజల అపోహలను తొలగించి, భూ యజమానులకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రైతుల ప్రయోజనాలే లక్ష్యం..

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నీటి లభ్యతకు అనుగుణంగా రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. వనపర్తిలో జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో జూరాల, భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి తదితర…