తెలంగాణ రాష్ట్ర టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో చైర్మన్ మారం జగదీష్, సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాస్ రావు నాయకత్వంలో నిర్వహించనున్న **చలో హైదరాబాద్** కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో విడుదల చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా టీజీఈ జేఏసీ చైర్మన్ భావాండ్ల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో జరిగే ఉపాధ్యాయ, ఉద్యోగ హక్కుల సాధన సభను విజయవంతం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
ఉద్యోగుల హక్కుల సాధనలో భాగంగా పీఆర్సీ, పెండింగ్ బిల్లుల చెల్లింపు, ఈహెచ్ఎస్ కార్డుల పూర్తి అమలు, ఓపీఎస్ సాధన వంటి ప్రధాన డిమాండ్ల కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. పెన్షన్ ప్రతి ఉద్యోగి జన్మహక్కు అనే నినాదంతో అందరూ హైదరాబాద్‌కు కదిలి రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కో-చైర్మన్ మధుసూదన్ రెడ్డి, సభ్యులు ఎం.డి. షర్ఫుద్దీన్, మునగాల సతీష్ కుమార్, సీహెచ్ వెంకట్, సంజీవ, అమరేందర్ రెడ్డి, టీజీఈ జేఏసీ నాయకులు బాలరాజు, నసీరుద్దీన్, గణేష్, జీకే వెంకటేష్, సురేష్ కుమార్, ప్రమోద్ కుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం చేసి ఉద్యోగుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని వారు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.
: సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలి:


