నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్‌గా సేవలందిస్తున్న పీడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ టి. ఉషారాణి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఆమె కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు.

డాక్టర్ టి. ఉషారాణి 2025 జూలై నెల నుంచి నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించారు. ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆసుపత్రిలో వైద్య సేవల మెరుగుదలతో పాటు పరిపాలనా పరంగా పలు మార్పులు చోటుచేసుకున్నాయని ఆసుపత్రి సిబ్బంది పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆమె పాత్ర విశేషంగా ఉందని పలువురు గుర్తు చేసుకున్నారు.

ఆమె బదిలీ నేపథ్యంలో నాగర్ కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన సూపరింటెండెంట్‌గా గైనకాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పి. సుప్రియ బాధ్యతలు స్వీకరించారు.

బదిలీ ఉత్తర్వులు అందిన అనంతరం డాక్టర్ టి. ఉషారాణికి ఆసుపత్రి సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. వివిధ విభాగాల వైద్యులు, విభాగాధిపతులు, ప్రొఫెసర్లు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, నర్సింగ్ అధికారులు, ఆర్‌ఎంఓలు, కార్యాలయ సిబ్బంది ఆమె సేవలను, ఆసుపత్రిలో తీసుకువచ్చిన మార్పులను గుర్తు చేసుకుంటూ సన్మానించారు.

డాక్టర్ ఉషారాణి బదిలీ నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు తీరని లోటుగా పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.: గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ టి. ఉషారాణి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *