నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఫిజియోథెరపీ ప్రాధాన్యతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

నాగర్ కర్నూల్ పాత కలెక్టర్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఫిజియోథెరపీ ఆరోగ్య సంరక్షణలో పోషిస్తున్న కీలక పాత్ర, శారీరక సమస్యల నుంచి కోలుకోవడంలో దాని ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తూ పాల్గొన్న వారు నినాదాలు చేశారు. పారామెడికల్ కళాశాల విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన సందేశాలను అందించారు.

ఈ సందర్భంగా ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. అనంతరం పలువురు ఫిజియోథెరపీ రంగానికి చెందిన వారిని సన్మానించారు. ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపీ సేవలు ఎంతో ముఖ్యమైనవని, ప్రజల్లో ఈ విధానంపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రవికుమార్, తెలంగాణ ఫిజియోథెరపీ వెల్ఫేర్ అసోసియేషన్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.ఎన్. సుమంత్, కార్యదర్శి డాక్టర్ ఎన్. సృజన, కోశాధికారి డాక్టర్ అంజలి, డాక్టర్ శైలజతో పాటు ఇతర వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.: నాగర్ కర్నూల్‌లో ఘనంగా ఫిజియోథెరపీ అవగాహన ర్యాలీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *