నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 112వ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ భాషా సంస్కృతుల పరిరక్షణకు, ప్రజా చైతన్యానికి కాళోజీ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తన రచనలు, కవిత్వం ద్వారా సమాజంలోని సమస్యలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడిగా కాళోజీ నిలిచారని పేర్కొన్నారు.

అన్యాయాన్ని ఎదిరిస్తూ, ప్రజల పక్షాన తన కలాన్ని ఆయుధంగా మలుచుకున్న కాళోజీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించడం ఆయనకు దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు.

నేటి తరం యువతతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా కాళోజీ నారాయణరావు జీవితాన్ని, ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ సేవలో ముందుకు సాగాలని అదనపు ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏవో కృష్ణయ్య, ఆర్ఐ జగన్, ఎస్ఐలు రమేష్, రామ్‌లాల్, ఆర్‌ఎస్‌ఐ ప్రశాంత్, గౌస్ పాషా, శివాజీతో పాటు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.: ప్రజాకవి కాళోజీ 112వ జయంతి సందర్భంగా ఘన నివాళులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *