జై వాసవి.. జై జై వాసవి నినాదాల మధ్య వాసవి క్లబ్ నాగర్‌కర్నూల్ ఆధ్వర్యంలో జోన్ చైర్మన్ అర్థం లలిత విజిట్ సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. నాగర్‌కర్నూల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్, పెద్దముదునూర్‌లో విద్యార్థులకు సుమారు రూ.3,000 విలువైన డిక్షనరీలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు సంబు అపర్ణ శ్రీనివాసులు ఆధ్వర్యంలో డిక్షనరీల పంపిణీ జరిగింది. విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

జోన్ చైర్మన్ అర్థం లలిత మాట్లాడుతూ, వాసవి క్లబ్ నాగర్‌కర్నూల్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అనేక సామాజిక, సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు తన పూర్తి ప్రోత్సాహం ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రమణారావు, పెద్దముదునూర్ సర్పంచ్ శ్రీకాంత్ హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతం కావడానికి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్ వాస రాఘవేందర్, దర్శి రాజయ్య, భాను ప్రకాష్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, హెడ్మాస్టర్ మోహనాచారి, పాఠశాల యాజమాన్యం సహకరించారు.

వాసవి అండ్ వాసవి వనిత క్లబ్ సభ్యులు, అధ్యక్షులు సంబు అపర్ణ శ్రీనివాసులు, కోశాధికారి ఆకుతోట నాగరాజు, స్వాతితో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు: వాసవి క్లబ్ నాగర్‌కర్నూల్ సేవా కార్యక్రమం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *