ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
పేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకాలు కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్‌లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిలను…
నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో డీఈఓ రమేష్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు
నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్‌లో ఎన్ఎస్‌యూఐ నాయకులు పందెం వెంకటేశ్వర్ రెడ్డి, మాదిరెడ్డి మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ప్రసవించిన ఘటనపై ఎస్ఎఫ్ఐ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, SO ను టర్మినేట్ చేసి సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ & కామర్స్ డిగ్రీ కళాశాలలో కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సౌజన్యంతో నీటి శుద్ధి ప్లాంట్ ప్రారంభమైంది.