👉🏻*పేదల చదువులకు ఆటంకాలు వద్దు*…
👉🏻*8 వేల కోట్ల ఫీజు బకాయిలు ఇవ్వండి రియంబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించండి*…
👉🏻*బిసి పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి*….
పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకాలు కలిగించకుండా ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని బీసీ పొలిటికల్ జెఎసి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. బకాయిల మంజూరుతో పాటు పథకాన్ని కొనసాగించాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో శనివారం రోజున బీసీ పొలిటికల్ జేఏసీ నాయకుల సమావేశంలో పాల్గొని ఈ సందర్భంగా దన్నోజు అరవింద్ చారి మాట్లాడుతూ విద్యార్థుల పట్ల పాలకుల చిన్న చూపు తగదన్నారు. ఫీజు రీయంబర్స్మెంట్ పథకం లక్షలాది పేదల కుటుంబాలలో వెలుగులు తెచ్చిందన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి బడుగు విద్యార్థులు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి ఉత్తమ పథకాన్ని ఎత్తివేసే కుట్రలకు పాల్పడటం మంచిది కాదన్నారు. ఉన్నత ఆశయంతో కాంగ్రెస్ సీఎం రాజశేఖర్ రెడ్డి తెచ్చిన ఈ సంక్షేమ పథకాన్ని అదే పార్టీకి చెందిన సీఎం ఎత్తివేయాలని ప్రయత్నించడం దురదృష్టకరమ
ని వ్యాఖ్యానించారు. మూసి సుందరీకరణ, మెట్రో, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు నిధుల కొరత లేదా అన్న సందేహాన్ని వ్యక్తం చేసిన దన్నోజు అరవింద్ చారి మూసి మీద ఉన్న ప్రేమలో కొంతైనా బడుగు బలహీన విద్యార్థుల మీద చూపాలని ముఖ్యమంత్రిని విజ్ఞప్తి చేశారు. నిధుల సాకుతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని చూడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని భావిస్తే విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని బీసీ పొలిటికల్ జెఎసి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ పట్టణ బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు గొడుగు రాజు, రమేష్, రాములు, మహేష్, ఆకాష్, తిరుపతయ్య తదితర బిసి పొలిటికల్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *