నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్‌గా గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహించిన కే. నారాయణ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి ఆయనకు పూలమాలలు, శాలువాతో సత్కరించి పదవీ విరమణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఉషారాణి మాట్లాడుతూ, నారాయణ ఆస్పత్రిలో తన విధులను నిబద్ధతతో నిర్వహించి అందరి ప్రశంసలు పొందారని తెలిపారు. ఆయన సేవలు ఆస్పత్రి అభివృద్ధికి ఎంతో ఉపయోగపడ్డాయని కొనియాడారు. ప్రభుత్వ సేవలో భాగంగా గతంలో రెవెన్యూ శాఖలో గద్వాల, తిమ్మాజీపేట ప్రాంతాల్లో కూడా సమర్థవంతంగా విధులు నిర్వర్తించినట్లు పేర్కొన్నారు.

పదవీ విరమణ అనంతరం ఆయనకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని అధికారులు, సహచర ఉద్యోగులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బంది నారాయణ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయనతో తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసంచాలకులు సిజే వసంత్ కుమార్, మోహన్ బాబు, రవి, గాలిబ్ అలీ, కుటుంబ సభ్యులు జంగమ్మ, గణేష్, గౌరీశ్రీ, చంద్రకాంత్, శిరీషతో పాటు ఆస్పత్రి వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని నారాయణకు శుభాకాంక్షలు తెలిపారు.: జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణకు ఘన పదవీ విరమణ సన్మానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *