నాగర్ కర్నూల్: జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈ నెల 9వ తేదీన ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నట్లు రిటైర్డ్ ఆప్తాలమిక్ ఆఫీసర్ బి. శివారెడ్డి తెలిపారు.

నాగర్ కర్నూల్‌లోని రాంనగర్ కాలనీ, రామకృష్ణ టాకీస్ రోడ్డులో గల శోభ ఆప్టికల్‌లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఈ ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

శిబిరానికి హాజరయ్యే రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి, ముఖ్యంగా క్యాటరాక్ట్‌తో బాధపడుతున్న రోగులకు ప్రత్యేక అంబులెన్స్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా ఎనుగొండలోని లయన్ రాంరెడ్డి కంటి ఆసుపత్రికి తరలించి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు బి. శివారెడ్డి తెలిపారు.

ఆపరేషన్‌కు అవసరమైన రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా రక్త పరీక్షలు, ఇతర సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించే సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

శిబిరానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డుకు సంబంధించిన జిరాక్స్ కాపీని వెంట తీసుకురావాలని నిర్వాహకులు సూచించారు. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు శిబిరానికి హాజరై ఉచిత వైద్య సేవలను పొందాలని కోరారు.

మరిన్ని వివరాల కోసం **9440454284, 8106333324** నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.

: సెప్టెంబర్ 9న నాగర్ కర్నూల్‌లో ఉచిత కంటి చికిత్స శిబిరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *