జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలి…
నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై పలు ఆరోపణలు చేస్తూ AISF, MSF, BSF, UISF, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి సమీపంలోని సెవెంత్ సెంటర్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ సుగుణ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.
40 ఏళ్ల సేవా ప్రస్థానంలో నూతన మైలురాయి…
నాలుగు దశాబ్దాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న నాగర్ కర్నూల్ జనరల్ మర్చంట్ అసోసియేషన్ నూతన మైలురాయిని చేరుకుంది.
పోక్సో కేసులో బెయిల్‌పై విడుదలైన నిందితుడి దారుణం…
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో పోక్సో కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితుడు, తనపై కేసు పెట్టిన కుటుంబంపై ప్రతీకారంతో ఆరుగురిని హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మన్ననూర్ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ
మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.
బొప్పల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే…
నాగర్‌కర్నూల్ జిల్లా బొప్పల్లి పీహెచ్‌సీని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.
‘జరగబోయే కురుక్షేత్రంలో గెలిచేది మేమే
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2029 జూన్‌లోనే ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణలో పార్లమెంట్ స్థానాలు 25కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.
కల్వకుర్తిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం
కల్వకుర్తిలో నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన షీ టీమ్ అవగాహన కార్యక్రమంలో మహిళల భద్రత, గంజాయి నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల అరికట్టడం, రోడ్డు భద్రతపై విద్యార్థులకు కీలక సూచనలు చేశారు.
కోడేర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…
వార్షిక తనిఖీల్లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ కోడేర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఘనంగా దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు
బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
