నాగర్‌కర్నూల్ జిల్లా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ కల్పించాలి…

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

పాలెంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా పరిసర గ్రామాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందడంతో పాటు వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు…

నాగర్‌కర్నూల్‌లో రూ.12 కోట్లతో అత్యాధునిక బస్టాండ్‌కు శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్న ఈ బస్టాండ్ ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు పట్టణ అభివృద్ధికి ఊతమివ్వనుంది.

నాగర్‌కర్నూల్‌లో ఘనంగా వైఎస్సార్ విగ్రహావిష్కరణ..

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించారు.

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు నూతన బస్టాండ్..

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు రూ.20 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి జూలై 8న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో ప్రజారవాణా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దులో పూడ్చిపెట్టిన భార్య..

మియాపూర్‌లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి మహారాష్ట్ర సరిహద్దులో మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్‌తో కేసును ఛేదించారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల కోసం బాచారం వద్ద నిర్మిస్తున్న స్వచ్ఛంద పునరావాస కాలనీని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు. అన్ని మౌలిక సదుపాయాలతో ఆదర్శ పునరావాస కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.

హైదరాబాద్‌లో నకిలీ సౌందర్య శిక్షణపై తెలంగాణ వైద్య మండలి దాడి..

హైదరాబాద్ హైటెక్ సిటీలోని హెయిర్‌సైన్స్ క్లినిక్‌లో నిర్వహిస్తున్న అనధికార సౌందర్య వైద్య శిక్షణపై తెలంగాణ వైద్య మండలి దాడి చేసింది. నకిలీ శిక్షణా సంస్థలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

బీఆర్ఎస్ ఆందోళన మధ్య మానవత్వం చాటిన సీఐ అశోక్ రెడ్డి..

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి వృద్ధ రైతును "భోజనం చేశావా పెద్దాయన?" అంటూ ఆప్యాయంగా పలకరించిన ఘటన అందరి మనసులను హత్తుకుంది.