నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ టౌన్ మరియు మండలంలోని పాఠశాలల్లో రాష్ట్రోపాధ్యాయ సంఘం (STU) సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో STU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రమేష్ పాల్గొని ప్రభుత్వాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆరు డీఏల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు దాటిందని, వెంటనే కమిటీ నివేదిక తెప్పించి 51 శాతం ఫిట్మెంట్‌తో PRC ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు CPS రద్దు చేసి OPS అమలు చేయాలని, GPF, మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవ్ పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో STU నాగర్‌కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, నాగర్‌కర్నూల్ మండల అధ్యక్షుడు పి. బాలస్వామి, నరసింహతో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.: ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్‌తో వెంటనే PRC ప్రకటించాలి:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *