ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ, టెట్ పాస్ కాని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన మెటీరియల్‌ను సిద్ధం చేసిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నాయకత్వాన్ని ఆయన అభినందించారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం గత 80 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల ఉద్యోగ భద్రత, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా అత్యంత నాణ్యమైన మెటీరియల్‌ను సిద్ధం చేశామని తెలిపారు. ప్రతి పేపర్‌కు సంబంధించిన ఆరు పుస్తకాల సెట్‌ను అతి తక్కువ ధరలో అందిస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు అనిల్ కుమార్ రెడ్డి, ప్రభాకర్, నాగర్‌కర్నూల్ మండల శాఖ అధ్యక్షుడు బాలస్వామి, తాడూర్ మండల శాఖ అధ్యక్షుడు సురేష్ బాబుతో పాటు పలువురు ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.: టెట్ పాస్ కాని ఉపాధ్యాయులకు ఎస్‌టీయూటీ టెట్ మెటీరియల్ ఉపయోగకరం

