నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఆధునిక సదరం కేంద్రాల అభివృద్ధికి రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చిస్తోందని, ప్రతి కేంద్రంలో ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమిస్తున్నట్లు సీఈవో తెలిపారు. గత 75 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,839 మంది దివ్యాంగులకు UDID కార్డులు మంజూరయ్యాయని, పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి అర్హ దివ్యాంగుడికి UDID కార్డు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు గిరిజనుల కోసం ప్రత్యేక మొబైల్ సదరం (UDID) క్యాంపులు నిర్వహించాలని, వైద్య బృందాలు గ్రామాలకే వెళ్లి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అదేవిధంగా అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక సదరం కేంద్రం ఏర్పాటు చేయాలని, శ్రవణ లోపం ఉన్న దివ్యాంగుల పరీక్షల కోసం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో అత్యాధునిక సౌండ్‌ప్రూఫ్ గదిని ఏర్పాటు చేయాలని సూచించారు. దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అన్ని సేవలను ఒకే వేదికపై అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అర్హులందరికీ ప్రభుత్వ సేవలు చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.: దివ్యాంగులకు సకాలంలో UDID కార్డులు అందించాలి.




