ఇటీవల నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలలో వస్పరి ఆంజనేయులు మద్యం మత్తులో వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా, విచారణ అనంతరం న్యాయస్థానం రెండు రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది.
ఈ సందర్భంగా పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రంకన్ డ్రైవ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని, అమాయకుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు.
ట్రాఫిక్ ఎస్సై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మద్యం సేవించిన తర్వాత వాహనాలు నడపకుండా ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాలను వినియోగించాలని, కుటుంబ సభ్యుల భద్రతతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. డ్రంకన్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి 2 రోజుల జైలు.
