క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు వాస రాఘవేందర్ సూచన మేరకు తాడూరులోని ఎంపీపీఎస్ తాడూరు హెచ్‌డబ్ల్యూ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం.డి. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడూరు మండల విద్యాధికారి త్యాగరాజు గౌడ్ మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా క్లాస్మేట్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. క్లబ్ అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తాడూరు క్లాస్మేట్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస ఆచార్యులు, ఉపాధ్యాయులు రాధిక, లక్ష్మి, రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద ముద్దునూరు పాఠశాలలో విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి విజేతలను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమానికి పల్లెర్ల మోహనయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని బహుమతులను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యార్థుల్లో విద్యాపట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని క్లాస్మేట్ క్లబ్ ప్రతినిధులు పేర్కొన్నారు.: క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ..


