పశువులకు సమతుల్య దాణా, పచ్చిమేత, ఎండుమేత, ఖనిజ లవణాలు, పరిశుభ్రమైన తాగునీరు అందించడం ద్వారా పాల ఉత్పత్తి, పాల నాణ్యతను మెరుగుపరచవచ్చని తెలిపారు. అలాగే టీకాలు, నట్టల నివారణ కార్యక్రమాలను సకాలంలో చేపట్టడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉంటాయని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే పశుగ్రాస కొరత, నీటి కొరత, వేడి ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు సైలేజ్, హే తయారీ, పశుగ్రాస నిల్వ, నీడ మరియు నీటి నిర్వహణ వంటి అంశాలపై రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో పశుసంవర్ధకాన్ని కొనసాగించాలని నిపుణులు సూచించారు.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ విశ్రాంత డైరెక్టర్ లక్ష్మారెడ్డి, ప్రతారెడ్డి, విశ్రాంత డా. అనిల్, DVAHO డా. జ్ఞానశేఖర్, CEO డా. ఇందుకూరి కిషోర్, తెల్కపల్లి డా. డి. మధు, బల్మూర్ డా. డి. అనిల్, పారా సిబ్బంది, డెయిరీ ఫార్మ్ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.: తెల్కపల్లిలో పాడి పశువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం..
