నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంతో పాటు పాలెం గ్రామంలో భారతీయ జనతా యువమోర్చా (BJYM) ఆధ్వర్యంలో ‘ఫీజుల బకాయి – BJP లడాయి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి నాయకత్వంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పాలెంలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ (సుబ్బయ్య గారి కళాశాల), నాగర్‌కర్నూల్‌లోని స్పూర్తి కాలేజ్, పద్మావతి కాలేజ్, రవితేజ కాలేజ్, ఉర్దూ కాలేజ్, గీతాంజలి కాలేజ్, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులను కలిసి అవగాహన కల్పించారు. విద్యార్థులకు రావాల్సిన బకాయిల వివరాలను వారితోనే రాయించి సంతకాల సేకరణ నిర్వహించారు.

ఈ సందర్భంగా ధన్నోజు నరేష్ చారి మాట్లాడుతూ, రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపించారు. బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థులు పరీక్షలు, సర్టిఫికెట్లు, ఉన్నత విద్యలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, భవిష్యత్తులో ప్రతి విద్యా సంవత్సరానికి సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించే విధంగా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని BJYM నాయకులు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.: పాలెంలో BJYM ‘ఫీజుల బకాయి–BJP లడాయి’.. ఫీజు రీయింబర్స్‌మెంట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *