ఈ సందర్భంగా ఆడియాలజిస్ట్ శ్రీమతి ప్రశాంతి కందుకూరి మాట్లాడుతూ, చెవులు అత్యంత సున్నితమైన అవయవాలని పేర్కొన్నారు. చెవిలో ఇతర వస్తువులు పెట్టి గుబిలి తీయడం వంటి అలవాట్లను మానుకోవాలని, చెవులను ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉంచాలని సూచించారు. స్వయంగా మందులు వాడకుండా వైద్యుల సలహాతోనే చికిత్స పొందాలని, తద్వారా వినికిడి శక్తిని దీర్ఘకాలం కాపాడుకోవచ్చని వివరించారు.
శిబిరంలో సుమారు 30 మంది వృద్ధ విశ్రాంత ఉద్యోగులకు ఆధునిక పరికరాలతో వినికిడి పరీక్షలు నిర్వహించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా తగిన సూచనలు, సలహాలు అందించారు. వృద్ధుల్లో వినికిడి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ద్వారా జీవన నాణ్యత మెరుగుపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటశెట్టి, బొడ్డు పాండు, కృష్ణారెడ్డి, కృష్ణయ్య, పాండురంగయ్య, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.: నాగర్‌కర్నూల్‌లో ఉచిత వినికిడి పరీక్ష శిబిరం విజయవంతం


