సమావేశంలో బూత్ స్థాయిలో చేపడుతున్న కార్యక్రమాలు, ఓటరు నమోదు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం సూచించిన విధంగా ప్రతి బూత్‌లో సమర్థవంతంగా పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పోతుగంటి భరత్ ప్రసాద్ సూచించారు.
అనంతరం క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మరింత మమేకమవుతూ టౌన్ ప్రెసిడెంట్ చెవ్వ ప్రమోద్ కుమార్ ఇంట్లో భోజనం చేశారు. అదే ఇంట్లో రాత్రి బస చేసి కార్యకర్తలతో మమేకమై వారి అభిప్రాయాలు, స్థానిక పరిస్థితులను తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి కార్యకర్తలే వెన్నెముక అని పేర్కొంటూ, ప్రతి కార్యకర్త ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని ఆయన సూచించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, బీఎల్‌ఏ-2లు, బూత్ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యాచరణపై చర్చించారు.: పోతుగంటి భరత్ ప్రసాద్ నాగర్‌కర్నూల్ పర్యటన.. టౌన్ ప్రెసిడెంట్ ఇంట్లో భోజనం, రాత్రి బస


