పట్టించుకోని మిషన్ భగీరథ అధికారులు తూతు మంత్రం గానే ఉద్యోగాలు
నాగర్‌కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ తరచూ పగిలిపోతుండటంతో వేల లీటర్ల తాగునీరు వృథా అవుతోంది. దీంతో మల్కాపూర్, పులిజాల గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాత్కాలిక మరమ్మతులకు బదులుగా శాశ్వత…
ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లురవి భరోసా.
నాగర్‌కర్నూల్‌లో సంచలనం సృష్టించిన ఓం శ్రీ సాయిరాం ఫైనాన్స్ ఆర్థిక మోసం బాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ డా. మల్లురవి హామీ ఇచ్చినట్లు బాధితుల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. జప్తు చేసిన ఆస్తులను బహిరంగ వేలం వేసి…
నాగర్ కర్నూల్‌లో భారీ బైక్ చోరీ ముఠా గుట్టురట్టు..
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి పోలీసులు భారీ బైక్ చోరీ ముఠాను ఛేదించి 52 దొంగిలించిన మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు డ్రగ్స్ కేసులో ఇప్పటికే రిమాండ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
నాగనూల్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్..
నాగర్‌కర్నూలు జిల్లా నాగనూల్ బ్రిడ్జి సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత కేబుళ్లు, దట్టమైన పొదలు, షార్ట్ సర్క్యూట్ ప్రమాదం నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
డిగ్రీ అడ్మిషన్లకు చివరి అవకాశం..
2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల కోసం DOST స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు జూలై 20 నుంచి 26 వరకు జరుగనున్నాయి. స్పెషల్ ఫేజ్ అనంతరం అడ్మిషన్లు ఉండవని నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి తెలిపారు.
పాలమూరు ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి భేటీ
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి సమావేశమై శ్రీశైలం బ్యాక్‌వాటర్–డిండి ప్రతిపాదనతో పాటు ప్రాజెక్టు పురోగతిపై చర్చించారు.
ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులతో విద్యార్థుల భద్రతకు ముప్పు
నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు, అధిక ఫీజులు, విద్యార్థుల భద్రత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.
బ్రోంకోస్కోపీతో తొలగించి 17 ఏళ్ల బాలుడికి ప్రాణదానం
పదేపదే న్యుమోనియా, దగ్గుతో బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడి శ్వాసనాళంలో నాలుగేళ్లుగా చిక్కుకున్న ఆట వస్తువు ‘ఈల’ను మలక్‌పేట్ యశోదా ఆసుపత్రి వైద్యులు అధునాతన బ్రోంకోస్కోపీ ద్వారా విజయవంతంగా తొలగించారు. ఓపెన్ సర్జరీ లేకుండానే చికిత్స నిర్వహించడంతో బాలుడు వేగంగా కోలుకున్నాడు.
నాగర్‌కర్నూల్ ప్రజావాణికి 71 ఫిర్యాదులు..
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 71 ఫిర్యాదులు అందాయి. పెండింగ్ వినతులను త్వరగా పరిష్కరించడంతో పాటు ప్రతి సోమవారం సంక్షేమ హాస్టళ్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సమస్యలపై నివేదికలు సమర్పించాలని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
నాగర్‌కర్నూల్‌లో అరుదైన శస్త్రచికిత్స…
నాగర్‌కర్నూల్‌లో ఐదు నెలల గర్భిణికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి అండాశయంలో ఉన్న సుమారు మూడు కిలోల కణితిని వైద్యులు తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం గర్భం సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
