ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.
నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.
తెలంగాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 29న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పార్లమెంట్ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకువచ్చి బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని రాష్ట్ర అధికార ప్రతినిధి హైందవ రెడ్డి తెలిపారు.
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఆసరా పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 31 చివరి గడువు. అర్హులు అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ నాగిరెడ్డి సూచించారు.
పెద్ద ముద్దునూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వన మహోత్సవంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.
నాగర్‌కర్నూల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు.
బల్మూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ 8వ తరగతి విద్యార్థులకు స్వయంగా సాంఘిక శాస్త్రం పాఠం బోధించారు.
బల్మూర్‌లో రూ.146.71 కోట్లతో చేపట్టనున్న మూడు కీలక రహదారి అభివృద్ధి పనులకు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో బీజేపీ మహిళా మోర్చా నూతన జిల్లా కార్యవర్గాన్ని శనివారం ఆవిష్కరించారు. మహిళా సాధికారత, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయనుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్‌కు చెందిన యువకులు రూపొందించిన ‘బోనం మీద బోనం’ బోనాల పాటను హైదరాబాద్ ఫిలింనగర్‌లోని వైజయంతి మూవీస్ కార్యాలయంలో ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల చేశారు. యువత ప్రతిభను ఆయన అభినందించారు.
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో షీ టీం, భరోసా ఆధ్వర్యంలో మహిళలు, బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమస్యలు ఎదురైతే భయపడకుండా షీ టీంను సంప్రదించాలని ASI విజయలక్ష్మి సూచించారు.