యశోద ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీలు..
కిడ్నీ, అండాశయాలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర క్లిష్టమైన సమస్యలకు యశోద ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీలతో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు.
నాగర్‌కర్నూల్ తాజా వార్తలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు ప్రజా సమస్యల సమాచారం.
కిడ్నీ, అండాశయాలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర క్లిష్టమైన సమస్యలకు యశోద ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్, లాప్రోస్కోపిక్ సర్జరీలతో చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు.
41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా నాగర్‌కర్నూల్ పాత కలెక్టరేట్‌లో నిర్వహించిన కంటి శిబిరంలో 51 మందికి పరీక్షలు నిర్వహించగా, 21 మందికి కేటరాక్ట్ సమస్య గుర్తించారు.
నాగర్‌కర్నూల్‌లో జరిగిన రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య ఉద్యోగుల జిల్లా సమావేశంలో 2026–28 నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వేముల కుర్మయ్య ఎన్నికయ్యారు.
పెండింగ్ డీఏల విడుదల, పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ డిమాండ్లతో నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద జిల్లా ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు.
పేద విద్యార్థినికి ఉన్నత చదువుల కోసం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అండగా నిలిచారు. బి.పీ.ఎడ్ మొదటి సంవత్సరం ఫీజు కోసం రూ.32 వేల చెక్కును అందజేశారు.
తిమ్మాజిపేట్ పోలీస్ స్టేషన్‌లో పాలమూరు మహేందర్‌పై దాడి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై బీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను విధుల నుంచి తొలగించి నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్ చేసింది.
బీసీ కులగణన చేపట్టి ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఏర్పాటు చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షులు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రకటించింది.
తెలంగాణ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 29న నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో పార్లమెంట్ స్థాయి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి తీసుకువచ్చి బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతామని రాష్ట్ర అధికార ప్రతినిధి హైందవ రెడ్డి తెలిపారు.
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలో ఆసరా పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 31 చివరి గడువు. అర్హులు అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ నాగిరెడ్డి సూచించారు.