రాష్ట్ర స్థాయి నవోదయ ఖో-ఖో పోటీలకు శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో రాష్ట్ర స్థాయి ఖో-ఖో క్రీడా పోటీలను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ప్రారంభించారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, పోటీ తత్వాన్ని పెంపొందిస్తాయని ఆయన…
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడూర్ మండలానికి చెందిన రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్ప్రింక్లర్ పైపులను పంపిణీ చేశారు. నీటి పొదుపుతో అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు.
ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ప్రారంభం
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్‌ను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
బిజినపల్లి మండలంలో నిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, డీఏ బకాయిలు విడుదల చేసి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎస్ఐఆర్ డిజిటలైజేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హెమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
తాడూర్‌లో నకిలీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు..
తాడూర్ మండలంలోని ఆకునెల్లికుదురు గ్రామంలో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయం బయటపడింది. అధికారులు 80 నకిలీ డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.
బీజేపీ యువ మోర్చా నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ధన్నోజు నరేష్ చారి నియామకం
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ధన్నోజు నరేష్ చారిని రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షుడు గుండె గణేష్ నియమించారు. గత 16 ఏళ్లుగా బీజేపీలో సేవలందిస్తున్న నరేష్ చారి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.
బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుల నియామకం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు సూచనల మేరకు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండె రాష్ట్రంలోని యువ మోర్చా జిల్లా అధ్యక్షులను నియమించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జిల్లా అధ్యక్షులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
550 జీవో ప్రకారమే మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలి..
మెడికల్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు, జీవో 114ను రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో 550ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
