ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో కుల, ఆదాయ, నివాస, ఆధార్, పాన్ సేవల్లో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని వ్యక్తులకు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఫైళ్ల త్వరిత పరిష్కారం కోసం అదనపు డబ్బులు వసూలు చేస్తున్నట్లు కూడా నిర్ధారించారు.
ఈ ప్రక్రియలో ప్రభుత్వ సిబ్బంది మరియు మీ-సేవ నిర్వాహకులు కుమ్మక్కై పనిచేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తూ సేవలు అందిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
దాడుల సందర్భంగా కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు మరియు ఇతర రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అవినీతి పై బాధితులు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 1064కు సంప్రదించాలని డీఎస్పీ బాలకృష్ణ పిలుపునిచ్చారు.: మీ-సేవ కేంద్రాల్లో అధిక వసూళ్లు | మహబూబ్ నగర్‌లో ఏసీబీ దాడులు

