ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుప్రజాత మాట్లాడుతూ, విద్యార్థినులు భవిష్యత్తులో దృఢ సంకల్పంతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి చదవాలని, తమ తల్లిదండ్రులు మరియు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థినులను అభినందిస్తూ, వారి కృషి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో తక్కువ మార్కులు సాధించిన మరియు ఫెయిల్ అయిన విద్యార్థులు నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని సూచించారు.
అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 20, 2026 సాయంత్రం 5 గంటలలోపు కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.: ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినులకు ఘన సన్మానం



