నాగర్‌కర్నూల్ జిల్లాలో జర్నలిస్టుల అక్రిడేషన్ సమస్యలపై సానుకూల పరిణామం చోటుచేసుకుంది. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకు తప్పనిసరిగా అక్రిడేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు.
ఈ సమావేశానికి నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పి. విజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి ఆర్. సురేష్ కుమార్ హాజరై, జిల్లాకు సంబంధించిన కీలక సమస్యలను రాష్ట్ర నాయకత్వ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతానికి చెందిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అక్రిడేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో రంగారెడ్డి జిల్లా చూపిస్తున్న టెక్నికల్ సమస్యను ప్రస్తావించారు. దీనిపై స్పందించిన నాయకులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే నల్లమల్ల ప్రాంతంలోని మన్ననూరు, బ్రహ్మగిరి కేంద్రాల్లో పని చేస్తున్న మీడియా ప్రతినిధులకు కూడా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సంబంధిత కమిషనర్‌తో మాట్లాడి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా నాయకులు తెలిపారు.: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ తప్పనిసరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *