నాగర్ కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ (MLT) కోర్సు నూతనంగా మంజూరు చేయబడింది. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మదన్ మోహన్ తెలిపారు. డిగ్రీ స్థాయిలో ప్రభుత్వ కళాశాలలో ఈ కోర్సు మొదటిసారిగా ప్రారంభం కావడం విశేషమని ఆయన పేర్కొన్నారు.

ఇంటర్ పూర్తి చేసిన బైపీసీ విద్యార్థులు, ఇంటర్ స్థాయిలో ఎంఎల్టీ కోర్సు పూర్తి చేసిన వారు, అలాగే కస్తూర్బా గాంధీ కళాశాలల్లో సంబంధిత కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో డిగ్రీ స్థాయిలో ఎంఎల్టీ కోర్సు అందుబాటులో లేకపోవడంతో, ఈ కోర్సు విద్యార్థులకు మంచి అవకాశంగా మారనుందని తెలిపారు.

డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైందని, విద్యార్థులు DOST వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రవేశాలు పొందవచ్చని వెల్లడించారు.

అదేవిధంగా కళాశాలలో బీఎస్సీ లైఫ్ సైన్సెస్‌తో పాటు MPC, MPCS కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.: నాగర్ కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఎంఎల్టీ కోర్సు ప్రారంభం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *