జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ బస్తీలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బుధవారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆచార్య అభినవ శంక రానందస్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ధర్మ పరిరక్షణ కోసం ప్రతి హిందువు జాగృతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. హిందువుగా జీవించడం, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రతి హిందువు తమ పిల్లలు, కుటుంబ సభ్యులను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు.
భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి ధార్మిక కార్యక్రమాలు, సామాజిక కార్యకలాపాలు విస్తృతంగా నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజంలో ఐక్యత పెంపొందించుకోవడం ద్వారానే శక్తివంతమైన హిందూ సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
సమ్మేళనంలో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్త భాస్కరయోగి, ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సంఘ్ చాలక్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి పిడికిళ్ల జంగయ్య, పట్టణ కార్యవహ్ వేముల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.: ఎర్రగడ్డ బస్తీలో ఘనంగా హిందూ సమ్మేళనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *