పలు కంపెనీలు అల్లు అర్జున్ పేరును, చిత్రాలను అనుమతి లేకుండా ఉపయోగించడమే కాకుండా, ఏఐ యాప్‌ల ద్వారా ఆయన మాట్లాడుతున్నట్లుగా వీడియోలు సృష్టించి ప్రచారం చేస్తున్నాయని కోర్టుకు తెలియజేశారు. ఇది వ్యక్తిగత హక్కులు, ప్రచార హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు.
ఈ అంశంపై విచారణ చేపట్టిన జస్టిస్ తుషార్ రావు, ప్రాథమికంగా అల్లు అర్జున్ వాదనలను పరిశీలించి, ఆయనకు అనుకూలంగా తక్షణ ఆదేశాలు జారీ చేసే దిశగా ముందుకు వెళ్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ తరహా ఉల్లంఘనలను అడ్డుకోవాలని కోర్టును కోరారు.
డిజిటల్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కులను కాపాడాల్సిన అవసరం ఎంత ముఖ్యమో ఈ కేసు మరోసారి స్పష్టంచేస్తోంది.: అల్లు అర్జున్ పేరు దుర్వినియోగంపై దిల్లీ హైకోర్టుకు ఫిర్యాదు
