ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా నాగర్‌కర్నూల్ ఐడీఓసీలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయాల సాధనకు అధికారులు, యువత, ప్రతి పౌరుడు బాధ్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.
చెంచు గిరిజనులకు ఆధార్ నమోదు వేగవంతం చేయాలి..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని చెంచు గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15లోగా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి, నెలాఖరులోగా…
అప్పాయిపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లి ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, బోధన నాణ్యత, మౌలిక వసతులు, పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించి విద్యా ప్రమాణాల పెంపునకు…
నవజాత శిశువుకు తల్లిపాలే అమృతం.
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా. టి. ఉషారాణి నవజాత శిశువుకు పుట్టిన తొలి గంటలోనే తల్లిపాలను ఇవ్వాలని సూచించారు. తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలే శిశువుకు సంపూర్ణ…
ఉపాధ్యాయులకు 51% ఫిట్మెంట్‌తో వెంటనే PRC ప్రకటించాలి:
నాగర్‌కర్నూల్ టౌన్, మండలంలోని పాఠశాలల్లో నిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం (STU) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. రమేష్ పాల్గొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, 51% ఫిట్మెంట్‌తో PRC…
విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం
నాగర్‌కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిని కలిసి పీఆర్సీ, డీఏ బకాయిలు, ఆరోగ్య పథకం అమలు, పెన్షన్ సంబంధిత సమస్యల పరిష్కారానికి వినతిపత్రం సమర్పించారు. సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి…
భూ భారతి పోర్టల్‌పై పూర్తి అవగాహన పెంచుకోండి..
నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్లకు భూ భారతి పోర్టల్ నిర్వహణ, భూ రికార్డుల పారదర్శకత, ఆన్‌లైన్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్…
టెట్ పాస్ కాని ఉపాధ్యాయులకు ఎస్‌టీయూటీ టెట్ మెటీరియల్ ఉపయోగకరం
నాగర్‌కర్నూల్ జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రూపొందించిన టెట్ మెటీరియల్‌ను డీఈవో ఏ. రమేష్ కుమార్ ఆవిష్కరించారు. టెట్ పాస్ కాని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ మెటీరియల్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
48వ చాతుర్మాస్య మహోత్సవాలు…
జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 25 వరకు 48వ చాతుర్మాస్య మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, అన్నదాన కార్యక్రమాలు భక్తుల కోసం…
క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగుల పంపిణీ..
క్లాస్మేట్ క్లబ్ 365 రోజుల సేవా కార్యక్రమాల్లో భాగంగా తాడూరు మండలంలోని ఎంపీపీఎస్ తాడూరు హెచ్‌డబ్ల్యూ పాఠశాలలో ఒకటో తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం ఉపన్యాస పోటీలు కూడా నిర్వహించారు.
