గ్రామసభ నిర్వహణ సమయంలో అధికారుల సమక్షంలో చీరలను బల్లపై పరిచి ఉపయోగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై గ్రామస్థులు స్పందిస్తూ, ప్రజల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ వస్తువుల నిర్వహణలో నిర్లక్ష్యం మరియు దుర్వినియోగం జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెలికి తీయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారుల వైఫల్యమా..? లేక బాధ్యతారాహిత్యమా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.అదేవిధంగా ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామసభలో జరిగిన ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.: బిజినపల్లి గ్రామసభలో ఇందిరమ్మ చీరల దుర్వినియోగం..?
