ప్రభుత్వ వైద్య కళాశాల, నాగర్‌కర్నూల్ నూతన ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. దావూద్ సులేమాని మహమ్మద్‌కు కళాశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు అందజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేసి కళాశాల అభివృద్ధికి ఆయన నాయకత్వం దోహదపడాలని ఆకాంక్షించారు.
డా. దావూద్ సులేమాని మహమ్మద్ నాగర్‌కర్నూల్‌కు బదిలీపై రాకముందు ప్రభుత్వ వైద్య కళాశాల, మంచిర్యాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించారు. అక్కడ ఆయన పరిపాలనా నైపుణ్యం, విద్యా ప్రమాణాల పెంపు, వైద్య విద్యాభివృద్ధికి చేసిన కృషితో మంచి గుర్తింపు పొందారు. వైద్య విద్యా రంగంలో ఆయన అనుభవం నాగర్‌కర్నూల్ కళాశాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, నూతన ప్రిన్సిపాల్ నాయకత్వంలో కళాశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడటంతో పాటు పరిశోధన కార్యక్రమాలు, వైద్య సేవలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారుఅదేవిధంగా కళాశాల అభివృద్ధి, విద్యార్థుల శ్రేయస్సు కోసం తమ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇస్తూ, నూతన ప్రిన్సిపాల్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల నాగర్‌కర్నూల్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.: ప్రభుత్వ వైద్య కళాశాల నాగర్‌కర్నూల్ నూతన ప్రిన్సిపాల్‌కు విద్యార్థుల ఘన స్వాగతం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *