ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ హీరో, బిగ్‌బాస్ ఫేమ్ రాము రాథోడ్ హాజరయ్యారు. వేసవి శిబిరంలో శిక్షణ పొందిన విద్యార్థులు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. చిన్నారుల ప్రతిభను చూసి అతిథులు ప్రశంసలు కురిపించారు.
అనంతరం శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు రాము రాథోడ్ చేతుల మీదుగా ట్రైనింగ్ సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా రాము రాథోడ్ మాట్లాడుతూ, తాను ఒకప్పుడు నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలోజి సత్యం అకాడమీలోనే శిక్షణ పొందానని గుర్తుచేసుకున్నారు. నేడు తాను ఈ స్థాయికి చేరుకోవడంలో తన గురువు పోలోజి సత్యం చేసిన కృషి ఎంతో కీలకమని తెలిపారు.
కార్యక్రమంలో కళాగురువు పోలోజి సత్యంను రాము రాథోడ్ విద్యార్థుల సమక్షంలో ఘనంగా సన్మానించారు. అనంతరం తన గురువుకు పాదాభివందనం చేసి గురుభక్తిని చాటుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.
ఈ కార్యక్రమంలో కూచిపూడి భరతనాట్య కళాకారిణి సాయి లహరి, కొట్ర బాలాజీ, ప్రముఖ కళాకారులు పద్మాలయ ఆచార్య, ముక్తావళి, మురళీధర్, సత్యం, డాన్స్ మాస్టర్లు వెంకీ, వినయ్, పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రుతి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో చిన్నారులు, తల్లిదండ్రులు, సాంస్కృతిక కళాకారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.: వేసవి శిక్షణ ముగింపు వేడుకల్లో పాల్గొన్న బిగ్‌బాస్ ఫేమ్ రాము రాథోడ్






