ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ దేవసహాయం మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకొని కార్యాలయాలకు వస్తారని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం ప్రతి అధికారిపై ఉన్న బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులు ప్రాధాన్యతగా తీసుకుని వెంటనే పరిష్కరించాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చూసి, ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలపరిచే విధంగా అధికారులు పని చేయాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు: నేటి ప్రజావాణికి 42 ఫిర్యాదులు.. సత్వర పరిష్కారానికి ఆదేశాలు:


