కార్యకర్తలు మాట్లాడుతూ, శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి, సుపరిపాలన, జాతీయ భద్రత, సాంస్కృతిక పరిరక్షణ వంటి రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
అలాగే, ప్రధాని మోడీ అత్యధిక కాలం దేశ పరిపాలన కొనసాగిస్తున్న ప్రధానుల్లో ఒకరిగా నిలిచి విశేష గుర్తింపు పొందారని, అనేక దేశాలు ఆయన సేవలను గుర్తించి అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయని నాయకులు పేర్కొన్నారు. ఆయన నాయకత్వం దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో మరింత పెంచిందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్, జగదీశ్వర్ రెడ్డి, వారధి శీను, సీనియర్ నాయకులు యాదగిరిరావు, శేఖర్, రుద్రమదేవి, మల్లి, కేడి లక్ష్మణ్, విజయ్ శివ, గణేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది.: నాగర్ కర్నూల్‌లో ప్రధాని మోడీ 12 ఏళ్ల సుపరిపాలన సందర్భంగా ప్రత్యేక పూజలు


