సోమవారం నాగర్‌కర్నూల్‌లో మంత్రి సీతక్క పర్యటన
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క జూన్ 22న నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
జూన్ 23 నుంచి శ్రీ భక్త లక్ష్మీనరసింహస్వామి దేవాలయం 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో జూన్ 23 నుంచి 25 వరకు 8వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ప్రత్యేక పూజలు, హోమాలు, కళ్యాణ మహోత్సవం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మానసిక ప్రశాంతతకు యోగనే మార్గం…
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, హెల్త్ & వెల్‌నెస్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి యోగా ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు సందేశమిచ్చారు
అన్న-అక్క డిజిటల్ ట్రైనింగ్ విజయవంతం…
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రెండు రోజుల అన్న-అక్క ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ ఏఐ డిజిటల్ టీచింగ్/లెర్నింగ్ విజయవంతంగా ముగిసింది. 45 మంది విద్యార్థులు ఏఐ టూల్స్, డిజిటల్ టీచింగ్‌లో శిక్షణ పొంది ప్రభుత్వ…
విధుల్లో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సహాయం..
నాగర్‌కర్నూల్ జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ముగ్గురు పోలీసు అధికారుల కుటుంబాలకు తెలంగాణ స్టేట్ పోలీస్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఒక్కొక్కరికి రూ.99,800 చొప్పున విడో కార్పస్ ఫండ్ చెక్కులను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అందజేశారు.
వెల్దండలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృత పర్యటన..
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
రూ.2,000 కోట్ల టెండర్ గోల్‌మాల్ ఆరోపణలు.. బహిరంగ చర్చకు సిద్ధమన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
విద్యార్థులకు అందాల్సిన వస్తువుల కొనుగోలు టెండర్లలో రూ.2,000 కోట్ల గోల్‌మాల్ జరిగిందని ఆరోపించిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, దీనిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టెండర్ల ప్రక్రియలో పారదర్శకత ఉంటే…
నాగర్‌కర్నూల్‌లో రోడ్డు ప్రమాదం…
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తా సిగ్నల్ వద్ద XL లూనాను బులెరో వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నాగర్‌కర్నూల్‌లో ఘనంగా దివ్యాంగుల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనం
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్‌లో నిర్వహించిన దివ్యాంగుల జిల్లా స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పాల్గొని దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్,…
విద్యుత్ అంతరాయాలకు చెక్ – ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ కీలక ప్రకటనలు
నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ విద్యుత్ అంతరాయాల నివారణకు పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు
