సీఎండీ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించడం, సేవలను మరింత సమర్థవంతంగా మార్చడం కోసం పలు ఆధునిక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లపై పెరుగుతున్న లోడును దృష్టిలో ఉంచుకొని వాటి సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.
అలాగే ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో విద్యుత్ సరఫరా వ్యవస్థను పర్యవేక్షిస్తూ సమస్యలను ముందుగానే గుర్తించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా విద్యుత్ అంతరాయాలను తగ్గించి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.
నాగర్‌కర్నూల్‌లో ప్రత్యేకంగా విద్యుత్ శాఖ స్టోర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు శివాజీ ప్రకటించారు. దీని ద్వారా అవసరమైన పరికరాలు, సామగ్రి తక్షణమే అందుబాటులో ఉండి మరమ్మత్తులు వేగవంతం అవుతాయని వివరించారు. అలాగే విద్యుత్ శాఖ ఉద్యోగుల భద్రత, గుర్తింపునకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త జాకెట్లను అందరికీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఎస్‌ఈ నర్సింహారెడ్డి, డీఈ శ్రీధర్ శెట్టి తదితర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రజలు, రైతులకు నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు శాఖ కట్టుబడి ఉందని అధికారులు పేర్కొన్నారు.: విద్యుత్ అంతరాయాలకు చెక్ – ప్రాజెక్ట్ డైరెక్టర్ శివాజీ కీలక ప్రకటనలు


