Author: voiceofnagarkurnool@gmail.com

దివ్యాంగులకు సకాలంలో UDID కార్డులు అందించాలి.

దివ్యాంగులకు సకాలంలో UDID కార్డులు అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో నల్లమల్ల చెంచుల కోసం ప్రత్యేక మొబైల్ క్యాంపులు, అచ్చంపేట ఆస్పత్రిలో సదరం కేంద్రం, శ్రవణ లోపం ఉన్న వారికి…

డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి 2 రోజుల జైలు.

నాగర్‌కర్నూల్‌లో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వస్పరి ఆంజనేయులకు కోర్టు 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,100 జరిమానా విధించింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

వీబీజీ రామ్ జీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి.

నాగర్‌కర్నూల్ జిల్లాలో వీబీజీ రామ్ జీ పథకంలో పనిచేస్తున్న సాంకేతిక సహాయకులు తమ సమస్యల పరిష్కారం, పే స్కేల్ అమలు, సమయానికి జీతాలు, ల్యాప్‌టాప్‌ల మంజూరు వంటి డిమాండ్లతో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు.

తెల్కపల్లిలో పాడి పశువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం..

తెల్కపల్లిలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాడి పశువుల సంరక్షణ, నాణ్యమైన పాల ఉత్పత్తి, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే మార్గాలపై రైతులకు పశుసంవర్ధక శాఖ నిపుణులు సూచనలు అందించారు.

పాలెంలో BJYM ‘ఫీజుల బకాయి–BJP లడాయి’.. ఫీజు రీయింబర్స్‌మెంట్

నాగర్‌కర్నూల్, పాలెంలో BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఫీజుల బకాయి–BJP లడాయి' కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నాగర్‌కర్నూల్‌లో ఉచిత వినికిడి పరీక్ష శిబిరం విజయవంతం

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో నిర్వహించిన ఉచిత వినికిడి పరీక్ష శిబిరంలో 30 మంది వృద్ధులకు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సూచనలు అందించారు.

పోతుగంటి భరత్ ప్రసాద్ నాగర్‌కర్నూల్ పర్యటన.. టౌన్ ప్రెసిడెంట్ ఇంట్లో భోజనం, రాత్రి బస

నాగర్‌కర్నూల్‌లో ఎస్‌ఐఆర్ మండల్ ప్రభాస్ అభియాన్‌లో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ బీఎల్‌ఏ-2లతో సమావేశమై కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. అనంతరం కార్యకర్త ఇంట్లో భోజనం చేసి అక్కడే రాత్రి బస చేశారు.

నాగర్‌కర్నూల్‌లో ఓటర్ల జాబితాపై భారీ ఆరోపణలు..

నాగర్‌కర్నూల్‌లో SIR ప్రక్రియలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని BRS నేతలు ఆరోపించారు. వేలాది మంది ఓటర్ల పేర్లను డ్రాఫ్ట్ రోల్ నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని పేర్కొంటూ సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు.

కల్వకుర్తిలో BJYM ఫీజుల బకాయి–BJP లడాయి ఉద్యమం

కల్వకుర్తిలో BJYM ఆధ్వర్యంలో నిర్వహించిన "ఫీజుల బకాయి – BJP లడాయి" కార్యక్రమంలో విద్యార్థుల నుంచి సంతకాల సేకరణ చేపట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

జర్నలిస్టుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం కొనసాగిద్దాం:

నాగర్‌కర్నూల్‌లో జరిగిన టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జి. మధు గౌడ్ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.