Tag: Nagarkurnool News

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులతో విద్యార్థుల భద్రతకు ముప్పు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు, అధిక ఫీజులు, విద్యార్థుల భద్రత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వంటి విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజు అరవింద్ చారి డిమాండ్ చేశారు.

జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలి…

నాగర్‌కర్నూల్ జిల్లాలో విద్యాశాఖ పనితీరుపై పలు ఆరోపణలు చేస్తూ AISF, MSF, BSF, UISF, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి జిల్లా విద్యాధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం…

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఈదమ్మ గుడి సమీపంలోని సెవెంత్ సెంటర్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ సుగుణ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.

40 ఏళ్ల సేవా ప్రస్థానంలో నూతన మైలురాయి…

నాలుగు దశాబ్దాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న నాగర్ కర్నూల్ జనరల్ మర్చంట్ అసోసియేషన్ నూతన మైలురాయిని చేరుకుంది.

మన్ననూర్ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మిక తనిఖీ

మన్ననూర్ పీటీజీ చెంచు గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన నేపథ్యంలో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

బొప్పల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే…

నాగర్‌కర్నూల్ జిల్లా బొప్పల్లి పీహెచ్‌సీని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని అధికారులకు ఆదేశించారు.

కోడేర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…

వార్షిక తనిఖీల్లో భాగంగా నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ కోడేర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

ఘనంగా దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు

బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు దన్నోజి అరవింద చారి జన్మదిన వేడుకలు నాగర్‌కర్నూల్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

నాగర్‌కర్నూల్ జిల్లా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ కల్పించాలి…

రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని కోరుతూ నాగర్‌కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి వినతిపత్రం సమర్పించారు.

పాలెంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సబ్‌స్టేషన్ ద్వారా పరిసర గ్రామాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందడంతో పాటు వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు…