Tag: nagarkurnool

ఎల్‌నినో ప్రభావంతో అప్రమత్తం..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

బిజినపల్లి మండలంలో నిర్వహించిన రాష్ట్రోపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, డీఏ బకాయిలు విడుదల చేసి సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని సంఘం నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎస్ఐఆర్ డిజిటలైజేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హెమంత్ కేశవ్ పాటీల్ ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆగస్టు 3లోగా ఎన్యుమరేషన్ ఫారాలు సమర్పించేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

తాడూర్‌లో నకిలీ డీఏపీ ఎరువుల దందా బట్టబయలు..

తాడూర్ మండలంలోని ఆకునెల్లికుదురు గ్రామంలో నకిలీ డీఏపీ ఎరువుల విక్రయం బయటపడింది. అధికారులు 80 నకిలీ డీఏపీ బస్తాలను స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేశారు.

550 జీవో ప్రకారమే మెడికల్ అడ్మిషన్లు చేపట్టాలి..

మెడికల్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించిన బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు, జీవో 114ను రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో 550ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నాగనూల్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్..

నాగర్‌కర్నూలు జిల్లా నాగనూల్ బ్రిడ్జి సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత కేబుళ్లు, దట్టమైన పొదలు, షార్ట్ సర్క్యూట్ ప్రమాదం నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

40 ఏళ్ల సేవా ప్రస్థానంలో నూతన మైలురాయి…

నాలుగు దశాబ్దాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న నాగర్ కర్నూల్ జనరల్ మర్చంట్ అసోసియేషన్ నూతన మైలురాయిని చేరుకుంది.

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు నూతన బస్టాండ్..

47 ఏళ్ల తర్వాత నాగర్‌కర్నూల్‌కు రూ.20 కోట్లతో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణానికి జూలై 8న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలో ప్రజారవాణా అభివృద్ధికి ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 200 మంది విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు దాతల సహకారంతో ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.

బీఆర్ఎస్ ఆందోళన మధ్య మానవత్వం చాటిన సీఐ అశోక్ రెడ్డి..

నాగర్‌కర్నూల్‌లో బీఆర్ఎస్ ఆందోళన సందర్భంగా సీఐ అశోక్ రెడ్డి వృద్ధ రైతును "భోజనం చేశావా పెద్దాయన?" అంటూ ఆప్యాయంగా పలకరించిన ఘటన అందరి మనసులను హత్తుకుంది.