Tag: nagarkurnool

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు ఘన సన్మానం

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో జిల్లా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ టి. ఉషారాణితో పాటు వైద్యులను ఘనంగా సన్మానించారు.

లట్టుపల్లి పీహెచ్‌సీలో వైద్యులకు ఘన సన్మానం

అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని **లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)**లో వైద్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు డాక్టర్ టీ. ప్రసన్న, డాక్టర్ మేఘనాలను ఆరోగ్య సిబ్బంది శాలువాలతో సత్కరించి…

జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణకు ఘన పదవీ విరమణ సన్మానం

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో జూనియర్ అసిస్టెంట్ కే. నారాయణ పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బంది ఆయన సేవలను కొనియాడారు.

నాగర్‌కర్నూల్‌లో కుటుంబ కలహాలే హత్యకు కారణం..

నాగర్‌కర్నూల్ జిల్లా ఆవంచ గ్రామంలో కుటుంబ కలహాలు, ఆస్తి వివాదం కారణంగా జరిగిన యాదయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య, కుమార్తె, అల్లుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం

నాగర్‌కర్నూల్ జిల్లా శిశు సంక్షేమ, మహిళా సాధికార శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, నినాదాల రచన పోటీల విజేతలకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు.

మానసిక ప్రశాంతతకు యోగనే మార్గం…

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, హెల్త్ & వెల్‌నెస్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి యోగా ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులకు సందేశమిచ్చారు

వెల్దండలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృత పర్యటన..

నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ విస్తృతంగా పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించడంతో పాటు బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

జర్నలిస్టు కూతురు చదువు కోసం ముందుకొచ్చిన జర్నలిస్టులు

నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు రామస్వామి కూతురు చదువు కొనసాగించేందుకు జర్నలిస్టులు కలిసి రూ.15 వేల ఆర్థిక సహాయం అందించారు. ఐజేయూ సభ్యులు, జర్నలిస్టు నాయకులు పాల్గొని మానవత్వాన్ని చాటారు.

అమర్నాథ్ యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు…

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అమర్నాథ్, కేదార్నాథ్, చార్ ధాం యాత్రికులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ధృవీకరణ పత్రాలు జారీ చేశారు.

నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయం ప్రారంభం…

నాగర్ కర్నూల్‌లో గ్రామీణ కూట బ్యాంకు కార్యాలయాన్ని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మహిళా వ్యాపారులకు రుణాల చెక్కులను పంపిణీ చేశారు.