నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించబడనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ అమరేందర్ ఆదేశించారు. ఈ సందర్భంగా శుక్రవారం జూమ్ సమావేశం నిర్వహించి, జిల్లాలోని అన్ని పదో తరగతి పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు (CS), డిపార్ట్మెంటల్ అధికారులు మరియు సంబంధిత సిబ్బందికి ముఖ్యమైన సూచనలు జారీ చేశారు.

పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులపై కఠినంగా ఫ్రిస్కింగ్ నిర్వహించాలని, నిషేధిత వస్తువులు అయిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని స్పష్టం చేశారు. పరీక్షా సిబ్బంది కూడా ఎలాంటి మొబైల్ ఫోన్లను వినియోగించరాదని, ప్రతి రోజు చీఫ్ సూపరింటెండెంట్ విధి రిజిస్టర్లో “No Phone” సర్టిఫికేట్ నమోదు చేయాలని సూచించారు.

విద్యార్థులు, సిబ్బంది, ANMలు, ఇతర సిబ్బంది ఎవరూ కూడా పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్లు తీసుకురాకూడదని కఠినంగా ఆదేశించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా కేంద్రంలోకి ప్రవేశించే ముందు తమ మొబైల్ ఫోన్లను వాహనాల్లోనే ఉంచాలని తెలిపారు.క్లరికల్ సిబ్బంది, రిలీవర్లు పరీక్ష పూర్తయ్యే వరకు CS గదిని విడిచి వెళ్లకూడదని సూచించారు. అలాగే అన్ని వాహనాలు పరీక్షా కేంద్రం వెలుపలే పార్క్ చేయాలని తెలిపారు. చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పరీక్ష సమయంలో తరచూ పర్యవేక్షణ చేస్తూ, ఎటువంటి అనధికార వ్యక్తులు కేంద్రంలోకి ప్రవేశించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రశ్నపత్రాల భద్రతపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ నుండి పరీక్షా కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తీసుకురావడం, పరీక్ష అనంతరం పోస్టాఫీసుకు పంపే సమయంలో తప్పనిసరిగా ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని తెలిపారు.

పరీక్షల నిర్వహణలో అన్ని నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ అమరేందర్ అన్ని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ జూమ్ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్, పరీక్షల నిర్వహణ అధికారి రాజశేఖర్ రావు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.: ఎస్‌ఎస్‌సి పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *