కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామంపై అధికారిక ప్రకటన కోసం దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

నెల్లికొండ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో కవర్ షెడ్, సీసీ పేవ్‌మెంట్, చైర్మన్ చాంబర్, సమావేశ మందిరం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా నిలిచిన మంత్రి జూపల్లి కృష్ణారావు..

కొల్లాపూర్ మండలం సింగోటం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా తన వాహనంలో ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్యసాయం అందించారు. మంత్రి మానవత్వాన్ని స్థానికులు ప్రశంసించారు.

క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానం..

క్షయ వ్యాధి నివారణలో రాష్ట్రంలో తొలి స్థానాన్ని సాధించిన నాగర్‌కర్నూల్ జిల్లాకు మరో గౌరవం దక్కింది. ఉత్తమ జిల్లా టిబి అధికారిగా డాక్టర్ ఎం.డి. రఫీకి తెలంగాణ గవర్నర్ అవార్డు లభించగా, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సన్మానించారు.

యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్‌కు రాష్ట్ర స్థాయి ప్రశంసలు..

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీలో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని సీఎస్ సంజయ్ జాజు ప్రశంసించారు. ఆగస్టు 25లోగా రెండు జతల యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావంతో అప్రమత్తం..

ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.

పెద్దముద్దునూరులో నూతన ఎంపీపీఎస్ పాఠశాల ప్రారంభం..

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరులో నూతన ఎంపీపీఎస్ పాఠశాలను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, త్రిదండి చిన్న జీయర్ స్వామితో కలిసి ప్రారంభించారు. విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ కార్యాలయంలో BLAల సమావేశం..

నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన అన్ని వార్డుల BLAల సమావేశానికి ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరై పార్టీ బలోపేతం, ఓటరు జాబితా సవరణ, బూత్ స్థాయి సంస్థాగత నిర్మాణంపై కీలక సూచనలు చేశారు.

16వ వార్డు ప్రభుత్వ పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్ 16వ వార్డు ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించి, కంప్యూటర్ ఉపాధ్యాయుడు లేకపోవడంపై అధికారులకు వెంటనే నియామకం చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

నాగర్‌కర్నూల్ 16వ వార్డులో శ్రీ వీరనాగమ్మ అమ్మవారి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే

నాగర్‌కర్నూల్ 16వ వార్డులో జరిగిన శ్రీ వీరనాగమ్మ అమ్మవారి పండుగలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాల కోసం అమ్మవారిని ప్రార్థించిన ఆయనతో పాటు ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.